రోడ్డు ప్రమాదం జరగడంతో తాబేళ్ల అక్రమ రవాణా బాగోతం బయటపడింది.ఈ ఘటన కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు అగ్రహారం వద్ద ఆటోను లారీని ఢీకొట్టింది.
దీంతో అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది.గత కొన్ని నెలలుగా ముమ్మిడివరం, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం తదితర ప్రాంతాల నుండి ఒరిస్సా, పశ్చిమ్ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తాబేళ్లను సేకరిస్తున్నట్లు గుర్తించారు.ఈ ప్రమాదంలో సుమారు తాబేళ్లతో ఉన్న 15 మూటలు బయటపడ్డాయి.
ఘటనపై కేసు నమోదు చేసిన కాట్రేనికోన పోలీసులు విచారణ చేపట్టారు.







