రైతు సంఘాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీకానున్నారు.నేటి నుంచి అన్ని రాష్ట్రాల రైతులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.
అదేవిధంగా రేపు జాతీయ రైతు సంఘం నేత టికాయత్ సహా మరి కొంతమంది నేతలతో సమావేశం కానున్నారు.కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో రైతు సంఘాలను ఢిల్లీ నేతలు సమన్వయం చేస్తున్నారు.అయితే, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్న కేసీఆర్.
వరుస సమావేశాలు నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







