చక్కెర, చక్కెర ఆహారాలు, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని అధికంగా తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, మెనోపాజ్ వంటి రకరకాల కారణాల వల్ల సన్నగా ఉండాల్సిన పొట్ట బానలా తయారవుతుంటుంది.దాంతో శరీర ఆకృతి దెబ్బ తినడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టు ముట్టే అవకాశాలు పెరుగుతాయి.
అందుకే బాన పొట్టను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.రోజూ ఉదయం మూడు ఖర్జూరాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం.
మరి ఇంకెందుకు లేటు ఖర్జూరాలను ఎలా తీసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు రెండు ఖర్జూరాలను తీసుకుని నిలువుగా కట్ చేసి.వాటిలో ఉండే గింజలను తొలగించాలి.

ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో కూర్చాలి.అంతే ఈ స్టఫ్డ్ ఖర్జూరాలను రోజూ ఉదయాన్నే తీసుకుంటే.పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.దాంతో ఈ బాన పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది.అంతేకాదండోయ్.ఈ స్టఫ్డ్ డేట్స్‌ను తీసుకోవడం వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.
రక్తహీనత సమస్య ఉంటే పరార్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
చర్మం నిగారింపుగా, యవ్వనంగా మారుతుంది.మరియు రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది.