న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో.
ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ రెండు సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ మంచి హిట్ అవ్వగా.
అంటే సుందరానికి మాత్రం ప్లాప్ అయ్యింది.ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం అంచనాలు అనుకోలేక విఫలం అయ్యింది.
దీంతో నాని మళ్ళీ రేసులో వెనుక బడ్డాడు.ఇక ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ సాలిడ్ మాస్ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు.
ఒక పోస్టర్ తో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.2023 మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు చెప్పారు.ఈ కొత్త పోస్టర్ లో నాని మరింత ఢీ గ్లామర్ గా కనిపిస్తున్నాడు.దీంతో ఈయన రోల్ ఎలా ఉండబోతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.దీంతో నాని పవర్ స్టార్ కు పోటీగా దిగబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







