విచిత్రమైన ఇంటి నిర్మాణం... కిచెన్ భారత్‌లో ఉంటే బెడ్ రూమ్ మయన్మార్‌లో ఉంది?

వినడానికి విచిత్రంగా వున్నా ఇది నిజమే.ఆ ఇంటి వాస్తు మేరేఇంటికీ ఉండదంటే నమ్మశక్యం కాదు.

 Weird House Architecture Kitchen Is In India But Bedroom Is In Myanmar?, House-TeluguStop.com

ఆ ఇంట్లోని కిచెన్ భారత్‌లో ఉంటే బెడ్ రూమ్ మాత్రం మయన్మార్‌లో ఉంటుంది.దీంతో ఆ ఇంట్లోని వారు భారత్‌లో భోజనం చేస్తూ, మయన్మార్‌లో నిద్రపోతున్నారు.

వివరాల్లోకి వెళితే… మనం ఇంత సేపు మాట్లాడుకుంటున్న ఈ ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని మన్ జిల్లాలో లోంగ్వా గ్రామంలో ఉంది.భారత్, మయన్మార్ దేశాల బార్డర్ లైన్ ఓ ఇంటి మధ్యలో నుంచి వెళ్లింది.

దీంతో వాళ్ల ఇంటి కిచెన్ భారత్‌లోకి, బెడ్రూమ్ మయన్మార్‌లోకి వెళ్లింది.

ఈ గ్రామంలోని ఆ ఒక్క ఇళ్లేకాదు… చాలా మంది ఇళ్లలోంచి రెండు దేశాల సరిహద్దు రేఖ వెళ్లింది.

కొణ్యక్ గిరిజన తెగకు చెందిన ప్రజలు జీవించే ఈ గ్రామం రెండు దేశాల కిందకు వస్తుంది.దాంతో వీరికి రెండు దేశాల సిటిజన్‌షిప్ కూడా ఉండటం గమనార్హం.

తమకు భారత్‌కు, మయన్మార్‌కు పెద్ద తేడా ఏమీ లేదని లోంగ్వా గ్రామ ప్రజలు చెబుతుంటారు.ఇక్కడి యువకులు కొందరు భారత్‌లో వ్యాపారం చేస్తుంటే.

మరికొందరు మయన్మార్‌ సైన్మంలో పని చేయడం గమనార్హం.ఇంకా వారికి రెండు దేశాలపైనా సమన ప్రేమ, హక్కు ఉందని గర్వంగా చెబుతున్నారు.

అవును… లోంగ్వా గ్రామంలోని కొణ్యక్ గిరిజన తెగకు అతి పెద్ద చరిత్ర ఉంది.భారత్‌లో అతి పురాతనమైన హెడ్ హంటర్స్‌గా ఈ తెగవారిని పేర్కొంటారు.

కొన్ని దశాబ్దాల కిందటి వరకూ తమ శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలను నరికి తీసుకురావడం వీరి సంప్రదాయంగా ఉండేది.అలా తలలు నరికి తీసుకొచ్చినందుకు వారి ఒంటిపై పచ్చబొట్టు వేసి సంబరాలు చేసుకునేవారు.

కాలం మారుతున్న కొద్ది కొణ్యక్ తెగ ప్రజలు కూడా మారిపోయారు.ఇపుడు అలాంటి విధ్వంసకాండలు అనేవి అక్కడ జరగవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube