బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది వీరి పేర్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే.
రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ విషయంలో అరెస్ట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఆ సమయంలో ఈ జంట అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇద్దరి పై విమర్శలను గుప్పిస్తూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.అయితే ప్రస్తుతం అవన్నీ మర్చిపోయి ఇద్దరు మామూలుగా ఉన్న విషయం తెలిసిందే.
అభిమానులు కూడా చాలా వరకు ఆ విషయాన్ని మరిచిపోయినట్టే కనిపిస్తోంది.కాగా ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.బెయిల్ పై బయట తిరుగుతున్నప్పటికీ మీడియా కంట కనపడకుండా తిరుగుతున్నాడు రాజ్ కుంద్రా.కాగా రాజ్ కుంద్రా, అతని బ్యాచ్ కలిసి యాక్టింగ్ ఫ్యాషన్ తో వచ్చిన యువతులను పోర్న్ వీడియోలు చిత్రీకరించి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇదే విషయం గత ఏడాది సంచలనంగా మారింది.

తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా అన్ని ఇండస్ట్రీలలో కూడా రాజ్ కుంద్రా పేరు కొద్ది రోజులు పాటు మారు మోగిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా రాజ్ కుంద్రా తనపై మోపిన ఆ కేసును కొట్టివేయాలి అని కోరుతూ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు.అయితే తనపై ఆరోపణలు చేసిన విధంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని, అదేవిధంగా రహస్యంగా ఎటువంటి చిత్రీకరణ కూడా చేయలేదని, అలాగే బ్లూ ఫిలిం వంటి కంటెంట్ కూడా అప్లోడ్ చేయలేదని, వాటిని ప్రసారం చేసే కార్యకలాపాలలో కూడా పాల్గొనలేదు అని ఆయన తెలిపారు.
అంతేకాకుండా చార్జ్ షీట్ లో కూడా తాను ఎవరిని బెదిరించలేదని, బలవంత పెట్టలేదని,వీడియో తీసి ఎక్కడ పోస్ట్ చేయడం కానీ, షేర్ చేయడం లాంటివి నేరాలు ఏమి చేయలేదని, ఈ కేసులో తనని బలి పశువును చేశారు అంటూ రాజ్ కుంద్రా ఆరోపించారు.అయితే తనపై ఈ కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించాడు.
మరి మెజిస్ట్రేట్ కోర్టు రాజ్ కుంద్రా కు అనుగుణంగా తీర్పునిస్తుందా? లేదంటే ఏం చెబుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.






