మందు తాగే ముందు చీర్స్ కొట్టడం వెనుక అసలు కారణం ఇదే?

ఆల్కహాల్ అలవాటు చాలామందికి ఉంటుంది.చాలామందికి మందుకు బానిసై మానుకోలేక బాధపడుతూ ఉంటారు.

 Is This The Real Reason Behind The Cheers Before Taking Alcohol Beer, Cheers,-TeluguStop.com

మరికొంతమంది లిమిటెడ్ గా తాగుతారు.ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడో లేదా వీకెండ్స్ లో చిల్ అవుతూ ఉంటారు.

ఫ్రెండ్స్ పార్టీలలో తాగేవారు కొంతమంది ఉంటారు.ఇలా మందు అలవాటు ఈ రోజుల్లో చాలామందికి ఉంటుంది.

ఈ అలవాటు కామన్ గా ఉంటుంది.మద్యం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాగేవారు చెబుతుంటారు.

ఎక్కువ తాగితే ఆరోగ్యానికి హానికరమని, కానీ రెండు, మూడు పెగ్గులు రోజు తీసుకుంటే ఏం కాదని చెబుతూ ఉంటారు.ఇక తాగని వాళ్లు మాత్రం మద్యం అనారోగ్యానికి హానికరమని, కిడ్నీ, గుండెకు నష్టం చేస్తుందని చెబుతూ ఉంటారు.

ఏది ఎలా ఉన్నా.మద్యం ఆరోగ్యానికి హానికరమే అని డాక్టర్లు చెబుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంచితే.మద్యం తాగేటప్పుడు చీర్స్ కొట్టుకుంటారు.

గ్లాస్ లు తాకించి కొడతారు.ఇలా తాగేటప్పుడు చీర్స్ కొట్టడం వెనుక కూడా చరిత్ర ఉందట.

చీర్స్ అనేది పాత ఫ్రెంచ్ పదం చియర్ నుంచి వచ్చిందట.దీని అసలు అర్థం తల అని చెబుతారు.

ఆనందం, ఉత్సాహం అనే భావాన్ని వ్యక్తపరచడానికి ఈ పదం ఉపయోగించేవారట.చీర్స్ కొట్టేటప్పుడు కొన్ని చుక్కల మందు కింద పడుతుందని, సంతప్తి చెందిన ఆత్మలకు ఉపశమనం ఇస్తుందని ఒక నమ్మకం ఉంది.

ఇక గ్లాసుల శబ్దం విని దుష్టశక్తులు దూరంగా వెళ్లిపోతాయని జర్మన్ల నమ్మకం.ఇక పురాతన కాలంలో గ్రీస్ నమ్మకం మరోలాఉంది.

చీర్స్ అంటూ గ్లాసులను పైకి ఎత్తడం ద్వారా దేవునికి సమర్పించే సంజ్ఝ అని గ్రీస్ లో మరో నమ్మకం.ఇక జర్మన్లు మద్యం తాగడానికి గ్లాస్ ఎత్తినప్పుడు కళ్లు, నాలుక, చర్మం, చెవులు, ముక్కులను ముట్టుకుంటారు.

చెవులకు కూడా ఆనందాన్ని కలిగించేందుకు చీర్స్ చెప్పుకుంటారట.ఇలా తాగే ముందు చీర్స్ చెప్పుకోవడం వెనుక చాలా నమ్మకాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube