'లైగర్‌' కి మెగాస్టార్ ప్రత్యేక శుభాకాంక్షలు

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన లైగర్ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేశారు.

 Chiranjeevi Best Wishes To Vijay Devarakonda Liger Movie , Chirenjeevi, Flim New-TeluguStop.com

దాదాపు నెల రోజులుగా కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా విజయ్ దేవరకొండ ఇతర యూనిట్‌ సభ్యులు సినిమా ను ప్రమోట్‌ చేశారు.ప్రస్తుతం సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా టాక్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి సినిమా యూనిట్‌ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేశాడు.

తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవాలి.తెలుగు సినిమా పరిశ్రమకు మంచి ఊపు తీసుకు రావాలి అన్నట్లుగా మెగాస్టార్ తన ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

చిరంజీవి మరియు లైగర్ యూనిట్ సభ్యులు గతంలో ఒక సారి కలిశారు.ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన ట్వీట్‌ తో పాటు షేర్ చేశాడు.

చిరంజీవి నటిస్తున్న ఒక సినిమా లో డాషింగ్‌ డైరెక్టర్ పూరి గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు.ఆ కారణంగా కూడా ఈ సినిమా కు చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం లైగర్‌ సినిమా థియేటర్లలోకి వచ్చింది.పలువురు ప్రముఖుల శుభాకాంక్షలతో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది అందరి లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రమోషన్ ను చాలా విభిన్నంగా చేయడం వల్ల అంచనాలు పెరిగాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది మరి కొన్ని గంటల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube