టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన లైగర్ సినిమా విడుదల కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ, అనన్య పాండే.
అదేవిధంగా డైరెక్టర్ పూరి, చార్మి కూడా ఎమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.కాగా ఇప్పటికే ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ లైగర్ సినిమా ప్రమోషన్స్ ని మరింత పెంచే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లకు విషెస్ చెబుతూ.
లైగర్ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు చిరు.కాగా చిరంజీవి వేసిన ఈ ట్వీట్‌ను చూసి ఛార్మీ ఎమోషనల్ అయింది.ఉదయాన్నే ఈ ట్వీట్ చూసి నాకు ఆనందం పట్టలేకున్నాను సర్ అంటూ చిరు ట్వీట్ చూసి ఎమోషనల్ అయింది చార్మీ. వెంటనే మీరు లైగర్ టికెట్ బుక్ చేసుకోండి అని ఛార్మీ ట్వీట్ చేసింది.
కాగా ఈ ట్వీట్ పై నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ స్పందిస్తూ.ఏంటి చార్మీ గారు.మీరేం అనుకుంటున్నారు.గ్రాడ్ యువర్ టికెట్ అంటున్నారు.అసలు థియేటర్లు మొత్తం ఫుల్ అయి ఉన్నాయ్.మీరే టికెట్లు పంపించండి అని బ్రహ్మాజీ ట్వీట్లు వేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ పై స్పందించిన కొందరు.అందుకే మేం ముందుగానే బుక్ చేసుకున్నాం అని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేయగా, మరికొంతమంది మొత్తం హౌస్ ఫుల్ అయ్యాయ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేసారు.సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ ట్వీట్స్ బట్టి చూస్తే లైగర్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది.







