విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన లైగర్ సినిమా లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.
సినిమా లో ఆమె ప్రజెన్స్ సినిమా పై అంచనాలు మరింతగా పెంచింది.సినిమా లో మొదట జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు పూరి భావించాడట.
కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేను అంటూ చెప్పడంతో అనన్య పాండేను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
చుంకీ పాండే తనయ అయిన అనన్య పాండే అప్పుడప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది.
దాంతో ఆమె కు మంచి స్టార్ డమ్ ఈ సినిమా తో వస్తుందనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఆమె ఈ సినిమా లో నటించడం ను సమర్థించారట.ఈ సినిమా లో అనన్య పాండే నటించేందుకు కాస్త ఎక్కువ డేట్లు ఇవ్వడం జరిగింది.
మొదట ఈ సినిమా కు గాను అనన్య పాండే కోటిన్నర పారితోషికం ను డిమాండ్ చేసింది.షూటింగ్ పొడిగించాల్సి వచ్చింది.అలాగే సినిమా కరోనా వల్ల ఎక్కువ కాలం షూటింగ్ చేయాల్సి వచ్చింది.

దాంతో అనన్య పారితోషికం 1.75 కోట్ల కు పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.ఒక బాలీవుడ్ హీరోయిన్ కు ఈ పారితోషికం తక్కువే.
అయితే కొత్త హీరోయిన్ అవ్వడం వల్ల ఈ స్థాయి లో ఇవ్వడం జరిగిందట.పూరి జగన్నాధ్ తో సినిమా అంటే కచ్చితంగా మంచి క్రేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆమె కూడా పారితోషికం విషయంలో ఎక్కువగా పంతం కు పోకుండా కరణ్ జోహార్ ఆమె ను ఒప్పించాడని తెలుస్తోంది.
నిజంగానే ఆమెకు భారీగా క్రేజ్ అయితే వచ్చింది.







