ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.అక్కడ ఎటువంటి ప్రొమోషన్స్ లేకుండానే 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 ఘన విజయంతో పార్ట్ 2 అంచనాలు అమాంతం పెరగడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ పై మునుపటి కంటే మరింత ఫోకస్ పెట్టి సుక్కు స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు.
మరి మెగా అల్లు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ పార్ట్ 2 లో ఎలా కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు.
పార్ట్ 1 సమయంలోనే పార్ట్ 2 భాగాన్ని కూడా కొంత షూట్ చేసారనే విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ సీన్స్ ను కూడా రీ షూట్ చేయబోతున్నారట.
మరి ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు పార్ట్ 1 లో మ్యూజిక్ ఎలా ప్లస్ అయ్యిందో పార్ట్ 2 లో కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్ చేయాలనీ చూస్తున్నాడు.ఇప్పటికే యూరప్ లో దేవి శ్రీ సుకుమార్, చంద్రబోస్ తో కలిసి కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశారట.ముఖ్యంగా ఐటెం సాంగ్ ఇప్పటికే లిరిక్స్ తో సిద్ధం అయినట్టు తెలుస్తుంది.
దేవి ఐటెం సాంగ్ కోసం అదిరిపోయే విధంగా రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.ఇక ఈసారి సమంతకు ధీటుగా ఉండే బాలీవుడ్ బ్యూటీని దింపుతున్నారట.
చూడాలి దేవి శ్రీ తన ట్యూన్స్ తో ఎలా ఆకట్టుకుంటాడో.







