ప్రయోగం సక్సెస్.. ఎలుకలు కూడా కార్లు నడపగలవు..!

ఎలుకలు సాధారణంగా ప్రతిచోటా కనిపిస్తాయి.ఎలుకలు ప్రవేశించని ఇల్లు లేదనే చెప్పాలి.

 The Experiment Is A Success Rats Can Also Drive Cars , Rats , Viral Latest, Ne-TeluguStop.com

శాస్త్రవేత్తలు ఎలుకలపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.అయితే అవన్నీ మెడిసిన్ కి సంబంధించినవి.

తాజాగా యూఎస్ లోని రిచ్ మండ్ విశ్వవిద్యాలయం ఎలుకలపై ఓ అధ్యయనం చేసింది.ఇందులో భాగంగా ఎలుకలు కార్లు నడుపగలవని నిరూపించారు శాస్త్రవేత్తలు.

ప్రత్యేకంగా తయారు చేసిన కారు లాంటి వాహనాన్ని ఎలుకలు నడుపుతున్నాయి.

ఎలుకలు నడుపుతున్న కారు నిజమైంది కాదు.

ఖాళీ ప్లాస్టిక్ పెట్టెలతో తయారు చేశారు.అయితే ఈ చిన్న కారును నడపగల నైపుణ్యాన్ని ఎలుకలు స్వయంగా సంపాదించుకోవడం అనేది ఇక్కడ పెద్ద సక్సెస్ అని చెప్పాలి.

యూనివర్సిటీ ఆఫ్ రిచ్ మండ్ లోని కెల్లీ లాంబెర్ట్ ఈ చిన్న కార్లను తయారు చేశారు.ఈ కారు లోపల ఎలుకలు తాకేలా మూడు రాగి కడ్డీలు ఉన్నాయి.

ఎలుకలు బార్ ని తాకినప్పుడల్లా, అది సర్క్యూట్ ని పూర్తి చేస్తుంది.అప్పుడు కారు కదులుతుంది.

ఎడమ వైపున ఉన్న బార్ కారును ఎడమ వైపుకు, కుడి వైపున ఉన్న బార్ కారును కుడి వైపుకు కదిలిస్తుంది.

Telugu Plastic Boxes, Rats, Rats Drive Cars, Latest-Latest News - Telugu

ఈ ప్రయోగం కోసం లాంబెర్ల్ అతని టీమ్ ఆరు ఆడ, నాలుగు మగ ఎలుకలను ఎంపిక చేసుకున్నారు.ఈ కార్లను నడపడానికి వాటికి శిక్షణ ఇచ్చారు.కారును నడిపినందుకు వాటికి ఆహారం పెట్టారు.

అంటే, కారు ముందు ఆహారాన్ని ఉంచారు.దానిని పొందడానికి, ఆహారం ఎక్కడ పెట్టారో అటువైపుకు కారు నడిపాయి.

మొదట్లో ఎలుకలు రాగి కడ్డీలను తాకినప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవారు.కానీ తర్వాత రివార్డ్ పరిమితిని పెంచారు.

క్రమంగా ఆహారం యొక్క దూరం పెంచారు.ఎలుకలు వాటిని తినాలనే కోరికతో కారు నడపడం ప్రారంభించాయి.

ఇక తదుపరి అభివృద్ధి కోసం అధ్యయనం కొనసాగిస్తుననారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube