సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీఎదకు వెళ్లనుంది.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.
అయితే ఈ సినిమా నిర్మాతలు దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.ఆ క్రమంలో ఓవర్సీస్ డీల్ పాతిక కోట్ల దాకా సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.
అయితే నిర్మాతల ఆశల మీద మహేష్ నీళ్లు చల్లినట్టు తెలుస్తుంది.
ఇది కేవలం తెలుగు వరకే రిలీజ్ చేయాలని మహేష్ చెబుతున్నాడట.
తన పాన్ ఇండియా సినిమా కేవలం రాజమౌళితోనే ఉండాలని మహేష్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు.అందుకే మహేష్ త్రివిక్రం సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అంటున్నాడట.
ప్రస్తుతం మహేష్ ని కన్విన్స్ చేసే పనిలో ఉన్నారట దర్శక నిర్మాతలు.మహేష్ మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది.
మరి మహేష్ 28వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుందా లేక కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా అన్నది త్వరలో తెలుస్తుంది.







