యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కేంద్ర మంత్రి అమిత్ షా ల భేటీకి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.బీజేపీ నాయకులు.
వైకాపా మాజీ మంత్రి కొడాలి నాని ఇంకా ఎంతో మంది ఈ విషయమై చర్చిస్తున్నారు.ఒక వైపు టీఆర్‌ఎస్ అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా బీజేపీ పై ఉంది.
ఇలాంటి సమయంలో వెళ్లి ఎన్టీఆర్ బీజేపీ అధినేత అయిన అమిత్ షా ను కలవడం అనేది టీఆర్‌ఎస్ వర్గాల వారికి తీవ్రంగా కోపం ను కలిగిస్తుంది.మరో వైపు తెలుగు దేశం పార్టీ కుటుంబం కు చెందిన ఎన్టీఆర్ ఎలా వెళ్లి అమిత్ షా ను కలుస్తాడు అంటూ కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు.
ఈ సమయంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో రివర్స్ ఎటాక్ కు దిగుతున్నాయి.ఎన్టీఆర్ ను కేవలం సినిమా ల విషయం లో మాట్లాడేందుకు మాత్రమే అమిత్ షా కలిశాడు.
ఆ విషయం లో ఎలాంటి సందేహం లేదు.
గతంలో ప్రభాస్ ను స్వయంగా ప్రధాని మోడీ కలిసిన విషయం తెల్సిందే.
ఆ సమయంలో రాని చర్చ.రాజకీయ రచ్చ ఇప్పుడు ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు అమిత్ షా ను కలిశాడు అంటూ చర్చ జరపడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.ఈ విషయం లో కొందరు అతి ఉత్సాహంను చూపిస్తున్నారు అని.అందుకు సంబంధించిన వార్తలను పదే పదే వేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సరే ఒక వేళ ఎన్టీఆర్ బిజేపీని సపోర్ట్ చేస్తే తప్పు ఏంటీ.
ఎవరి వ్యక్తిగతం వారిది.బీజేపీ కి మద్దతు తెలిపినంత మాత్రాన హీరో ఎన్టీఆర్ కాస్త విలన్ ఎన్టీఆర్ అవుతాడా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.







