భారత దేశంలో ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ కాలంలో దోమలు, ఈగల బెడద ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రజలు దోమల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్, మస్కిటో బ్యాట్స్, మస్కిటో నెట్ ఇలా చాలా వాడేస్తున్నారు.కానీ దోమలను సమర్థవంతంగా వెళ్లగొట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన టూల్ అందుబాటులోకి వచ్చింది.దానిని ఉపయోగిస్తే ఒక్క దోమ లేంటి ఈగలు వంటి కిటకాలన్నీ ఇల్లు వదిలి పారిపోవాల్సిందే.
దీనిని ఉపయోగించడం కూడా చాలా సింపుల్.మస్కిటో రిపెల్లెంట్స్ లాగానే దీనిని ప్లగ్‌లో ఇన్‌సెర్ట్ చేసి, స్విచాన్ చేస్తే సరిపోతుంది.
నిజానికి మస్కిటో రిపెల్లెంట్స్ నుంచి ఉత్పత్తయ్యే కెమికల్ స్మెల్ చాలామంది భరించలేరు.ఇలాంటి వారికి ఈ టూల్ బాగా పనిచేస్తుంది.
ఇంతకీ దీని పేరు ఏంటంటే ‘రాడార్‌కాన్ ఆర్-200‘.ఇదొక హైపర్‌సోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ సిస్టమ్.పేరుకు తగినట్లుగానే ఇది పనిచేస్తుంది.దీనిని ఆన్ చేయగానే చుట్టుపక్కల ఈగలు, దోమలు, చీమలు సహా అన్ని కీటకాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాయి.అంతేకాదు చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఎలాంటి దోమ ఉండదు.ఎందుకంటే దీని ప్రభావం సుమారు 2,700 చదరపు అడుగుల పరిధి వరకు ఉంటుంది.
ప్రస్తుతానికైతే ఈ అద్భుతమైన పరికరం అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే అమ్ముడు పోతుంది.త్వరలోనే ఇండియాలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది.అయితే దీని ధర 59.99 డాలర్లు (రూ.4,773) అని గమనించాలి.







