హైదరాబాద్, 22 ఆగష్టు, 2022: గత కొన్ని వారాల్లో రాధే శ్యామ్, కిన్నెరసాని, పెళ్లి సందడి, కేజిఎఫ్: చాప్టర్ 2 వంటి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వినోదాన్ని పంచిన ‘జీ తెలుగు’, ఈ సారి ‘ది కశ్మీర్ ఫైల్స్‘ అనే మరో పాన్-ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనుంది.వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబోర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సర్, దర్శన్ జోషి,మ్రిణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది.
ఈ చిత్రంలోని నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి.1990 లలో కశ్మీరీ పండితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారంగా తీసుకొని నిర్మించబడిన ఈ చిత్రం కశ్మీరీ పండితుడు పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) మనవడైన కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) చుట్టూ తిరుగుతుంది.కశ్మీరీ పండితుల యొక్క నిర్గమనం (ఎక్సోడస్) పై సందిగ్ధంలో ఉన్న కృష్ణ పండిట్, తన తాత యొక్క చివరి కోరికను తీర్చడానికి కశ్మీర్ కు వెళ్తాడు.అక్కడ కృష్ణ పండిట్ పుష్కర్ నాథ్ యొక్క మిత్రుల ద్వారా కశ్మీర్ నిర్గమనం గురించి మరియు తన తల్లితండ్రులు ఎలా చనిపోయారో తెలుసుకోవడంతో కథఅడ్డం తిరుగుతుంది.
కశ్మీరీ పండితుల పాత్రలలో నటీనటులు చేసిన అద్భుత ప్రదర్శనలు, మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ అందరిని టీవీలకు కట్టిపడేస్తాయి.