జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచేశారు.ఇప్పటి వరకు టిడిపితో జనసేన కలిసి వెళుతుందని, ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకుంటాయని, ఈ రెండు పార్టీలతో పాటు, బిజెపి కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుందని అంత ఒక నిర్ణయానికి వచ్చేసారు.
దీనికి తగ్గట్లుగానే టిడిపి, జనసేన పార్టీల అధినేతల వ్యవహార శైలి ఉంటూ వచ్చింది .అయితే ఈ పొత్తుల అంశంపై తిరుపతిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.ఏపీలో టిడిపి వైసిపిలతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు.అక్కడితో సరిపెట్టకుండా దేశం, రాష్ట్ర స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలని పవన్ కోరుకున్నారు.
అంటే ఏపీలో వైసీపీ టీడీపీలకు, కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం కావాలన్నది పవన్ అభిప్రాయంగా తెలుస్తోంది.ఏపీలో , టీడీపీ, వైసీపీ లకు ప్రత్యామ్నాయం అంటే జనసేన అనేది పవన్ అభిప్రాయం.
కేంద్రంలో బిజెపి , కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.మూడో ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసే పనిలో ఆయన ఉన్నారు.
పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలతో కేంద్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలోని ఫ్రంట్ అధికారంలోకి రావలనేది పవన్ అభిప్రాయంగా ఉందనేది ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది.

దేశంలో విధ్వంసకర పరిపాలన సాగుతోంది అంటూ పవన్ చెబుతున్నారు.కాంగ్రెస్ తో పవన్ చేతులు కలిపే ఛాన్స్ లేదు.అలా అని టీఆర్ఎస్ తో కలిసి వెళ్లే ఆప్షన్ కూడా లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో పవన్ వ్యాఖ్యలు గందరగోళం సృష్టించేలా ఉన్నాయి.అటు టిడిపి ఇటు బిజెపిలను కాదనుకొని పవన్ ఒంటరిగా ఏ ధైర్యం తో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
పవన్ వ్యాఖ్యలపై రాజకీయంగానూ తీవ్ర చర్చ జరుగుతోంది.







