ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనేదానికంటే, రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నదానిపైనే జగన్ దృష్టి పెట్టారు.తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ కు జగన్ అప్పగించారు.
ఈ టీమ్ నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ప్రత్యర్థుల బలాబలాలను, తెలుసుకుంటూ దానికి అనుగుణంగా వ్యవహారాలు రూపొందిస్తూ వస్తోంది.ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రిషి రాజ్ సింగ్ వైసిపికి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు వైసిపి అనేక స్లొగన్స్ జనాల్లోకి వదిలింది.
రావాలి జగన్ కావాలి జగన్, బై బై బాబు , వంటి స్లోగన్లను జనాల్లోకి తీసుకువెళ్లి సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు అదే రకమైన స్లొగలను వైసీపీ కోసం తయారు చేసే పనిలో పీకే టీమ్ నిమగ్నమైంది.అలాగే వైసిపికి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా ను మరింత సమర్థవంతంగా వాడుకునేందుకు పీకే టీం వ్యూహాలు రచిస్తోంది.
దీనికోసం అనేక మార్పు చేర్పులు చేపడుతుంది .సోషల్ మీడియా విభాగంలోకి కొత్తగా మహిళలను ఎక్కువగా నియమించే ప్లాన్ చేస్తున్నారు.

మహిళలకు చట్టపరంగా రక్షణ ఉండడం , ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలు, పోస్టుల్లో వీరిని కించపరిచే విధంగా ఉంటే వారిపై కేసులు నమోదు చేయించేందుకు అవకాశం ఉండడం వంటి వాటిని లెక్కల్లోకి తీసుకుంటూ సోషల్ మీడియా విభాగాన్ని మహిళలతో ఎక్కువగా నడిపించాలని పీకే టీం సిద్ధం చేసిందట.ఇవే కాకుండా అనేక రాజకీయ వ్యూహాలను రూపొందించడం ద్వారా వైసిపి రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టే విధంగా పీకే టీమ్ ప్రణాళికలు రచిస్తోందట.ఎప్పటికప్పుడు పీకే టీం అందిస్తున్న నివేదికలపై జగన్ సైతం కసరత్తు చేస్తూ పార్టీలో అనేక మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.







