భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీకి మద్ధతుగా న్యూయార్క్‌లో భారీ ర్యాలీ..!!

దుండగుడి దాడిలో చావు అంచులా దాకా వెళ్లొచ్చారు భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీ.కొన్నిగంటల పాటు శ్రమించిన వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడగలిగారు.కానీ రోజుల పాటు రష్డీని వెంటిలేటర్‌పై వుంచాల్సి వచ్చింది.అయితే అందరి ప్రార్ధనలు ఫలించి సల్మాన్ రష్డీ క్షేమంగా బయటపడ్డారు.ఆయనపై దాడిని ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, దేశాధినేతలు ఖండించారు.

 Writers, Many Supporters Hold A Rally For Author Salman Rushdie In New York,auth-TeluguStop.com

తాజాగా శుక్రవారం మిడ్‌టౌన్ మాన్‌హాట్టన్‌లోని న్యూయార్క్ లైబ్రరీ సెంట్రల్ బ్రాంచ్ వద్ద సల్మాన్ రష్డీ స్నేహితులు, రచయితలు, పలువురు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.పాల్ ఆస్టర్, గే టేలీస్, జెఫ్రీ యూజెనిడెస్, కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖ రచయితలు ఇందులో పాల్గొన్నారు.ర్యాలీలో భాగంగా 42వ వీధీ, ఫిఫ్త్ అవెన్యూ వద్ద, న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ సెంట్రల్ బ్రాంచ్ మెట్లపై సల్మాన్ రష్డీ రచనల్లోని కొన్ని భాగాలను చదివి వినిపించారు.ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమై, ఏకంగా రష్డీపై హత్యాయత్నానికి కారణమైన ది సాటానిక్ వెర్సెస్‌లోని కొన్ని భాగాలను కూడా వారు చదివారు.

Telugu Authorsalman, York, Yorkpublic, Salman Attack-Telugu NRI

అలాగే న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ, రష్డీ పబ్లిషర్ అయిన పెంగ్విన్ రాండమ్ హౌస్, లిటరేచర్ అండ్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పీఈన్‌లు సంయుక్తంగా ‘‘స్టాండ్ విత్ సల్మాన్’’ పేరిట భారీ సమావేశాన్ని నిర్వహించాయి.పీఈఎన్ సీఈవో నోసెల్ మాట్లాడుతూ… రష్డీ అలుపెరగని విజేత అన్నారు.

కాగా.సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’ కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.కానీ ఈ విషయాన్ని ఇరాన్ మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ ….

సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube