సినిమాలంటే కేవలం కమర్షియల్ సబ్జెక్టు మాత్రమే కాదు, డ్యూయెట్లు, రొమాన్స్ అంతకన్నా కాదు.నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉంటే చాలు అది సినిమా అని కూడా రోజుల్లో ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లేదనే చెప్పాలి.
తమ సినిమాల ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ను కూడా ఇవ్వచ్చు అనే సూత్రం నాటి రోజుల నుంచి నేటి రోజుల వరకు ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు.హీరోయిన్ తో రొమాన్స్ చేపించి, చిట్టి పొట్టి బట్టలు వేసి జనాల మీదికి వదిలే రోజులు పోయాయి.అలా మహిళల కోసం, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సమాజానికి సందేశం ఇస్తూ ఇటీవల వచ్చిన సినిమాలు ఏంటి అనే విషయం ఆర్టికల్ లో తెలుసుకుందాం.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల సినిమాలలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది హీరోయిన్ చుట్టూత సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.అలా వచ్చిందే లవ్ స్టోరీ సినిమా కూడా సాయి పల్లవి చుట్టూ తిరిగే ఈ కథలో ఆడపిల్లలను సొంత ఇంటి వారే ఎలా లైంగిక వేధింపులకు గురి చేస్తారు అనే విషయం ప్రపంచానికి తెలియజేశాడు తన సినిమా ద్వారా శేఖర్ కమ్ముల.అలాగే ఎలా బుద్ధి చెప్పాలనే విషయం కూడా సందేశాత్మకంగా చక్కగా తెలియజేశారు.

ఫిదా
శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ఫిదా.ఈ సినిమాలో తన అక్కను పెళ్లి చేసి ఫారెన్ పంపిస్తే తాను కూడా అత్తారింటికి వెళ్లాలా అనే కోణంలో ఈ చిత్రం వచ్చింది.తన కోసమే తన భర్త తన ఇంటికి రావాలని తపన పడే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించగా, ఈ సినిమా ఎంతోమందికి ఆదర్శప్రాయం అని చెప్పాలి.

పెళ్లిచూపులు
పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ తండ్రి తనకు ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం అన్నట్టుగా మాట్లాడితే హీరో విజయ్ దేవరకొండ నాలాంటి కొడుకు ఉంటే మీకు తెలిసేది ఇంట్లో బంగారాన్ని పెట్టుకొని కొడుకు ఎందుకు కావాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు అంటూ ఆడపిల్లల ప్రాధాన్యతను తెలియజేసే ప్రయత్నం చేశాడు ఇది ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో చక్కటి సందేశం సినిమా ప్రేక్షకులకు చేరిందని చెప్పాలి.

డియర్ కామ్రేడ్
రష్మిక విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ క్రికెటర్ గా నటించింది.కోచ్ తో హీరోయిన్ ఇబ్బంది పడుతూ ఉంటే క్రికెట్ మానేయాలని తండ్రి సూచించగా హీరో ఆ కోచ్ కి బుద్ధి చెప్తాడు.తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దాలి కానీ ఆడపిల్లల ఆశయాన్ని కాదు అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ప్రతి అమ్మాయి తండ్రికి చేరేలా ఉంటాయి.