లైగర్ సినిమాకి సీక్వెల్ చిత్రం.. అలా క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ?

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా లైగర్.ఈ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Vijay Deverakonda Gave Clarity On The Sequel Of Liger , Vijay Deverakonda , Lige-TeluguStop.com

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన చార్మి తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.ఈ సందర్భంగా ఛార్మి విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ లైగర్ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ ఉండొచ్చనీ, ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా సీక్వెల్ గురించి తెలియజేయడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Charmy, Liger, Puri Jagannath, Sequel Liger, Ua Certificate-Movie

ఈ సినిమా సీక్వెల్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇంకా లైగర్ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి సీక్వెల్ గురించి మాట్లాడటం మంచిది కాదు.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయితే తప్పకుండా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఈయన ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.అలాగే ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube