కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధరామయ్యను చంపుతామని వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణకు సీఎం బసవరాజ్ బొమ్మై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల కొడగు పర్యటనలో సిద్ధరామయ్య కారుపై గుడ్లు విసిరి, నల్ల జెండాలు ప్రదర్శించిన తర్వాత ఆయన భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు.
సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సీఎం బొమ్మై తెలిపారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు.ఈ మేరకు సిద్ధరామయ్యను వివరాలు ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు.
అనంతరం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు.అయితే, ఇటీవల సిద్ధరామయ్య ఒక కార్యక్రమంలో ఈ వ్యక్తులు గాంధీని చంపారు, వారు నన్ను వదులుతారా అని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.







