ఏపీలో బీజేపీ వ్యూహం.. బాబుతో దోస్తీ అందుకేనా..?

బీజేపీ వ్యూహాలు ప‌క్కా అమ‌ల‌వుతుంటాయి.వారు క‌న్నేసిన రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు.

 Bjp's Strategy In Ap . Is Friendship With Babu That's Why , Ap Poltics, Ycp, Ys-TeluguStop.com

రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ప‌నిచేస్తునే వాటిని చివ‌ర‌కి బీజేపీలో విలీనం చేసుకునే దిశ‌గా ప‌క్కా వ్యూహాన్ని అమలు చేస్తుంటారు.ఇక బీజేపీ కన్ను పడిన ఏ పార్టీ కూడా సుదీర్ఘ కాలం మనగలిగిన పరిస్థితి లేదు.

ఇక గతంలో గుజరాత్లో జనతాదళ్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని.తొలిసారి విజయం దక్కించుకున్న బీజేపీ.

తర్వాత.ఆ పార్టీని లేకుండా చేసింది.

జనతాదళ్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి.ఇలా ఒక్క గుజరాతే కాదు.

బిహార్లో ఎల్జీపీ.అసోంలో గణ పరిషత్ నాగాలాండ్ లో నాగా పార్టీ ఇలా అనేక పార్టీలను బీజేపీ స్నేహం చేసినట్టే చేసి.

వాటి బలహీనతలను తెలుసుకుని దెబ్బకొట్టిన పరిస్థితి తెలిసిందే.

ఇప్పుడు ఏపీలో టీడీపీపై

ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఏపీలో టీడీపీపై అములు చేయ‌బోతుందా అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో ప్ర‌స్తుతం బీజేపీ బ‌ల‌మైన నాయ‌కులు.క్యాడ‌ర్ లేద‌నేది తెలిసిందే.

గేట్లు ఎత్తినా ఎవ‌రూ చేర‌డం లేద‌నేది కూడా వాస్త‌వ‌మే.మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ ఓ వ్యూహంతో ముందుకు వెళ్తున్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తమను కోరివస్తున్న పార్టీని కలుపుకొని క‌లిసి ప‌నిచేస్తూనే భవిష్యత్తులో ఆ పార్టీని తమ వశం చేసుకునే యత్నాలు బీజేపీ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.

బీజేపీ వ్యూహాత్మకంగా వేసే అడుగులను గమనించాలని అంటున్నారు.ఏపీలో బీజేపీతో జట్టు కట్టేందుకు టీడీపీ ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే.నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ అంటే పడని.

ప్రధాని మోడీ తాజాగా పార్టీ అధినేతకు ఆహ్వానాలు పలికారు.

Telugu Amith Shah, Ap Poltics, Chandra Babu, Narendra Modi, Somu Veerraju, Ys Ja

ఇదంతా కూడా ప్లానా

బీజేపీ విధానాలను గమనిస్తే.అంతో ఇంతో బలంగా ఉన్న టీడీపీని తమవైపు తిప్పుకొంటే మున్ముందు ఆ పార్టీకి ఏర్పడే నాయకత్వ లోపాన్ని ఆసరా చేసుకుని పార్టీలోని నేతలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఈ క్ర‌మంలోనే టీడీపీని తమలో విలీనం చేసుకున్నా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఇక ఏపీలో ఇప్ప‌టికైతే బ‌లంగా వున్న వైసీపీని అలా చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో రాబోయే రోజుల్లో టీడీపీపై వ్యూహాత్మక ఎత్తుగడలను అనుసరించాలనే విధానంలో భాగంగానే ఇప్పుడు క‌లిసి ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంద‌ని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube