సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయి అబ్బాయి కలిసి చేసుకుంటారు.రాను రాను కాలాలు మారడంతో అబ్బాయి ఇంకొక అబ్బాయిని,అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది కామన్ గా మారిపోయింది.
అయితే ఒక అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకోవడం అన్నది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయమే.అయితే గతంలో ఈ విధంగా మహిళలు తమను తామే పెళ్లి చేసుకున్న ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
అయితే ఈ బాటలోనే పయనిస్తోంది సీరియల్ నటి కనిష్క సోని. దియా ఔర్ బాతీ హమ్ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోని ఇటీవల తనను తానే పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన మహిళ ఏ విధంగా అయితే నుదుట సింధూరం మెడలో మంగళసూత్రంతో కనిపిస్తుందో అదేవిధంగా ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది కనిష్క సోని.ఈ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చింది.
నా కలలు అన్నింటిని నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను.నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే.
అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను అని రాసుకొచ్చింది కనిష్క సోని.ఈ వీడియో పై కొందరు ఆమెకు మద్దతుగా స్పందించగా కొందరు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు.
అయితే ఆమెను ద్వేషిస్తూ తనపై నెగటివ్ గా కామెంట్స్ చేసినవాటిపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.

నన్ను నేను పెళ్లి చేసుకున్న అని పెట్టిన పోస్ట్‌పై చాలా మంది అనేక విధాలుగా స్పందిస్తున్నారు.ఇంకొందరు అయితే నన్ను ద్వేషిస్తున్నారు.అటువంటి వారందరికీ నేను నిజాయితీగా చెప్పేది ఒకటే.
నేను గుజరాత్‌కు చెందిన చాలా సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన యువతిని.పెళ్లి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో మంచి అనుభూతి ఉండేది.
ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఉండేది.కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడు ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు.
అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడు ఉండరని నాకు అర్థం అయ్యింది.అలాగే మనిషి లేకుండా నా జీవితాంతం సంతోషంగా జీవించగలను అని నేను నమ్మడానికి కారణం అదే.శృంగారం కోసం పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను.వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.
అది ప్రేమ, నిజాయితీకి సంబంధించినది అని చెప్పుకొచ్చింది నటి కనిష్క సోని.







