విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారి ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కు ఉత్తర భారతంలో పోటీ అనేది లేకుండా పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కు పోటీ అనేది లేదు. కార్తికేయ 2 సినిమా వచ్చి రెండు వారాలు అవుతోంది.
అంతకుముందు వచ్చిన బింబిసారా మరియు సీతారామం సినిమాలు కూడా కాస్త నెమ్మదించాయి.కనుక బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం విజయ్ దేవరకొండకు మెండుగా కనిపిస్తోంది.
మినిమంగా సినిమా ఆడిన కూడా కచ్చితంగా భారీ వస్తువులు నమోదయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు.సోలో రిలీజ్ దక్కడంతో సాలిడ్ గా వసూళ్లను దక్కించుకునే ఛాన్స్ ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.భారీ ఎత్తున సినిమా ఖర్చుపెట్టి ప్రమోషన్ చేస్తున్నారు, దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.కనుక ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి సినిమా ఆస్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలంటే మరో మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇప్పటికే జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ మరియు వచ్చిన బజ్ నేపథ్యంలో మంచి వసూళ్లు ఖాయమంటున్నారు.పైగా ఈ సినిమాకు పోటీ లేదు కనుక కచ్చితంగా మంచి అవకాశం గా పరిగణించవచ్చు.
ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుంది.చార్మి సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించింది, బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సినిమాని హిందీలో విడుదల చేస్తున్న విషయం తెలిసింది.