ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 34,436 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 33,945 క్యూసెక్కులుగా ఉంది.డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 105.788 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.అదేవిధంగా నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1633 అడుగులకు చేరి నిండుకుండను తలపిస్తుంది.







