విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.పాన్ ఇండియా వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మంచు విష్ణు జిన్నా టీజర్ కూడా సందడి చేయబోతుందట.
లైగర్ థియేటర్లలో విష్ణు జిన్నా టీజర్ కూడా వేస్తున్నారట.అదేరోజు జిన్నా టీజర్ రిలీజ్ చేస్తున్నారు.
జిన్నా సినిమాని కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అందుకే పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న లైగర్ తో పాటుగా జిన్నా టీజర్ కూడా వదలాలని ఫిక్స్ అయ్యారు.
మంచు విష్ణుతో పాటుగా ఈ జిన్నా సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమాకు కోనా వెంకట్ కథ అందించగా నూతన దర్శకుడు సూర్య డైరెక్ట్ చేస్తున్నారు.
లైగర్ తో పాటుగా విష్ణు జిన్నా అంటే టీజర్ క్లిక్ అయితే మాత్రం సినిమాపై మంచి బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.మరి ఈ అవకాశాన్ని మంచు విష్ణు ఏవిధంగా యూజ్ చేసుకుంటాడో చూడాలి.
తెలుగులోనే కాకుండా జిన్నా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం సినిమాపై బజ్ ఏర్పడేలా చేస్తుంది.







