బాలయ్య 107 రాకుండానే 108 మూవీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. అఖండ సినిమా ఇచ్చిన విజయంతో మరింత ఉత్సాహంగా మరో సినిమా ప్రకటించడమే కాకుండా చకచకా పూర్తి కూడా చేస్తున్నాడు.

 Nandamuri Balakrishna's New Movie Nbk 108 Latest Update, Nbk107, Anil Ravipudi ,-TeluguStop.com

ఈసారి కూడా బాలయ్య భారీ యాక్షన్ సినిమాతోనే రాబోతున్నాడు.క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ ద్వారా గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కర్నూల్ లో షూటింగ్ జరుపు కుంటుంది.

మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఇటీవలే అనిల్ ‘ఎఫ్ 3’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఇప్పుడు అనిల్ బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టాడు.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి మేకర్స్ సాలిడ్ అప్డేట్ కూడా ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ గా ఉన్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Nbk, Shruti Haasan-Movie

అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మరొక అదిరిపోయే వార్త వైరల్ అవుతుంది.బాలయ్య 107వ సినిమా రిలీజ్ కాకుండానే అప్పుడే 108వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే అప్పుడే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనీ అప్పుడే మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube