భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఆగస్ట్ 22 నుంచి వారం రోజుల పాటు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో పర్యటించనున్నారు .
లాటిన్ అమెరికా దేశాలతో భారత సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన పర్యటన జరగనుంది.ఆహారం, ఇంధన భద్రత, చమురు మార్కెటింగ్, భారత్- ఎంఈఆర్‌సీఓఎస్‌యూఆర్ మధ్య స్థిర ప్రాధాన్యత ఒప్పందాన్ని పొడిగించడం వంటి లక్ష్యాలను సాధించేలా జైశంకర్ దక్షిణ అమెరికా పర్యటన సాగనుంది.
భద్రత, రక్షణ, అణుశక్తి, ఫార్మాస్యూటికల్స్, విద్య, వాతావరణ మార్పు అంశాలు కూడా ఆయన పర్యటన ఎజెండాలో వున్నాయి.అంతేకాకుండా తన సహచరులు, వివిధ రంగాలకు చెందిన నాయకులతో జైశంకర్ సమావేశాలు నిర్వహిస్తారు.
బ్రెజిల్, అర్జెంటీనాలు నిస్సందేహంగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాములు.ప్రత్యేకించి అర్జెంటీనాతో గతేడాది నవంబర్‌లో జీ20 సమావేశాలలో భాగంగా బ్యూనస్ ఎయిర్స్‌కు వచ్చారు ప్రధాని మోడీ.అంతకుముందు 2019లో మారిసియో మాక్రి భారత పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య హోదా సాధించింది.2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్.అర్జెంటీనాకు నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.ఇప్పటికే అర్జెంటీనా సార్వభౌమాధికార వాదనకు భారత్ తన మద్ధతును స్పష్టం చేసింది.

ఇంతకుముందు ఇండోనేషియాలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో కెఫిరో, జైశంకర్‌లు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరూ చర్చించి ఆమోదించారు.ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య ఇటువంటి సమావేశాలతో పాటు గత జూన్‌లో జర్మనీలో జరిగిన జీ7 సమావేశంలో అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, ప్రధాని మోడీ మధ్య కూడా భేటీ జరిగిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రాజకీయ , ఆర్ధిక సహకారం, ప్రాంతీయ ప్రపంచ ఒప్పందాలను ఏకీకృతం చేయాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.







