సూర్యాపేట జిల్లా:నాటి మొగలుల పరిపాలన కాలంలోనే బహుజన రాజ్యం కోసం పరితపించిన గొప్ప పోరాట యోధుడు,ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు.గురువారం సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి వేడుకలు సూర్యాపేట సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ సాధన కమిటీ అధ్యక్షులు రాపర్తి కేశవ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మగాని ధర్మభిక్షం చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్ కోటను కేంద్రంగా చేసుకొని నాటి మొగల్ రాజుల అరాచకాలపై దండెత్తిన మహావీరుడని కొనియాడారు.
ఉత్తర భారత దేశంలో నాడు చత్రపతి శివాజీ ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న ఇద్దరు సమకాలీకులేనని కానీ,శివాజీకి వచ్చిన పేరు పాపన్న గౌడ్ కు రాలేదని వాపోయారు.ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వం పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించి భావితరాలకు తెలియజేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు గౌడ్,టిఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్,మాజీ కౌన్సిలర్ కక్కిరేణి సత్యనారాయణ గౌడ్,మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కక్కిరేణి నాగయ్య గౌడ్,రాపర్తి శ్రీనివాస్ గౌడ్,రాపర్తి మహేష్,పల్స వెంకన్న గౌడ్,టైసన్ శ్రీనివాస్,ఎలుగూరి రవి,రాపర్తి రవి, రాపర్తి రాము తదితరులు పాల్గొన్నారు.