డార్క్ స్కిన్ ను కలిగిన వారిలో చాలా మంది తమ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్‌ను ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.అలాగే ఫేస్ మాస్క్‌లు, సీరమ్స్ ను యూస్ చేస్తుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్స్, స్కిన్ బ్లీచింగ్ వంటి వాటిని చేయించుకుంటారు.కానీ, పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే డార్క్ స్కిన్ ను వైట్‌గా మరియు గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి డార్క్ స్కిన్ తో ఇంకెందుకు వర్రీ.
ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని నానబెట్టుకోవాలి.
ఈలోపు చిన్న బీట్ రూట్, చిన్న బంగాళదుంప లను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్‌ను పాలతో సహా వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు పూర్తిగా చల్లారబెట్టుకుని.అప్పుడు వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి చేశారంటే.రిజల్డ్ అదిరిపోద్ది.
డార్క్ స్కిన్ క్రమంగా వైట్‌గా మారుతుంది.చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా దూరం అవుతాయి.
మరియు స్కిన్ షైనీగా, గ్లోయింగ్‌గా కూడా తయారవుతుంది.