మన దేశంలో టీ ప్రియులు కోట్ల మంది ఉన్నారు.అందుకే టీకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.
సంపన్నుల నుంచి పేదల వరకు టీని ఎంతో ఇష్టంగా తాగుతారు.ఒక్క చాయ్ తాగితే చాలా మైండ్ రిలాక్స్ అయిపోద్ది.
ఇదే చాయ్ ఇప్పుడు యువతకు ఉపాధి మార్గంగా మారిపోయింది.ఉద్యోగం రాలేదన్న దిగులు, సంపాదన లేదన్న ఆందోళన లేదు.
పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఎంతో మంది చాయ్ వాలాలుగా మారి లక్షలు సంపాదిస్తున్నారు.అలా ఉద్యోగం వదిలి చాయ్ వాలిగా మారిన ఓ యువతి స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె పేరు నిషా హుస్సేన్. రాజ్ కోట్ కు చెందిన ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి చేసి టీ స్టాల్ ఏర్పాటు చేసింది.రాజ్ కోట్ లోని ఓ టీ కేఫ్ లో పనిచేస్తూ ట్రేడ్ లో మెళకువలు నేర్చుకుంది.ఇప్పుడు సొంతంగా ‘ది చైలాండ్’ పేరుతో ఓ టీస్టాల్ పెట్టి విజయవంతమైంది.
ఆమె టీ స్టాల్ లో 10 రకాల రుచులతో టీ విక్రయిస్తోంది.‘నీకు నచ్చిన పనిని సిగ్గుతో కాకుండా గర్వంగా చేయాలి’ అనేదే నిషా హుస్సేన్ విజయ సూత్రం.
2017లో కంప్యూటర్ ఆపరేటర్ గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.ఆ తర్వాత టీ స్టాల్ పెట్టాలని నిర్ణయించుకుంది.
అయితే నిషా టీ వ్యాపారం చేయడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.అయినా రహస్యంగా టీ అమ్మడం ప్రారంభించింది.
రాజ్ కోట్ కు చెందిన ‘చాయ్ వాలీ’ అనే టీ స్టాల్ లో వ్యాపార మెళకువలు నేర్చుకుంది.తర్వాత ‘ది చైలాండ్’ అనే టీ స్టాల్ ని ప్రారంభించింది.
![Telugu Job, Laksh, Tea Bussiness, Latest-Latest News - Telugu Telugu Job, Laksh, Tea Bussiness, Latest-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/08/nisha-hussen-from-rajkot-chaiwali-the-chailand-inspiring-story-detailsa.jpg )
వ్యాపారం ప్రారంభించిన కొత్తలో కస్టమర్లు ఎక్కువగా వచ్చేవారు కాదు.దాదాపు 15 రోజులు తాను చేసిన టీ పారేయాల్సి వచ్చేదట.అయితే ఓ రోజు ఓ కస్టమర్ తన వ్యాపారం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.దీంతో అది వైరల్ అయ్యింది.దీంతో నిషా టీ స్టాల్ ఫేమస్ అయిపోయింది.జనం కూడా ది చైలాండ్ కి రావడం ప్రారంభించారు.
ప్రజలు తనను రాజ్ కోట్ యొక్క చాయ్ వాలీ అని పిలవడం తనకు సంతోషంగా ఉందని చెబుతోంది.ప్రతి నెలా రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపింది.అయితే కరోనా సమయంలో టీ స్టాల్ మూసి వేయాల్సి వచ్చిందని, దీంతో కొంత నష్టం వచ్చిందని పేర్కొంది.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తన టీ స్టాల్ కి తీసుకొచ్చి తన విజయం గురించి చెబుతున్నారట.దీనిపై తనకు చాలా గర్వంగా ఉందని నిషా చెబుతోంది.