రజినీకాంత్, చిరు, శ్రీదేవి కాంబో.. అలా మిస్ అయ్యిందట.. లేకుంటే బాక్సాఫీస్ బద్దలే?

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గురించి మనందరికీ తెలిసిందే.ఈయన దాదాపుగా 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 Ashwani Dutt Interesting Comments On Ali Tho Saradaga Show Details, Ashwini Dutt-TeluguStop.com

ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.కాగా ఇటీవల కాలంలో అశ్వినీదత్ బ్యానర్ లో వచ్చిన మహానటి, జాతి రత్నాలు, సీతారామం లాంటి సినిమాలు విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాదించాయో మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉన్న ఎన్నో ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.

ఈ షోలో భాగంగా అ అశ్వినీదత్ మాట్లాడుతూ.

ఎన్టీఆర్ గారితో నేను సినిమా చేయాలి అనుకున్నప్పుడు మా బ్యానర్ కి ఆయనే వైజయంతి మూవీస్ అనే పేరును పెట్టారు.

ఇక అప్పట్లో టాప్ హీరోలు అయినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు కృష్ణ వీరందరూ కూడా మంచి క్రమశిక్షణ కలిగిన నటులు అని తెలిపాడు అశ్వినీదత్.ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇక రాంగోపాల్ వర్మ నాకు రెండు కథలు చెప్పాడు ఒకటి రంగీలా అయితే రెండవ సినిమా గోవిందా గోవింద.

Telugu Alitho Sardaga, Ashwini Dutt, Chiru, Ram Gopal Varma, Ashwani Dutt, Rajin

రంగీలా సినిమాలో శ్రీదేవి, రజనీ, చిరంజీవి కాంబినేషన్లో చేద్దామని అన్నాడు.ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకు చిరు గారి దగ్గరికి వెళ్లి రజిని గారి దగ్గరికి వెళ్లి గెస్ట్ అపీరియన్స్ మాదిరిగా ఉంటుంది అని చెప్పడం ఎందుకు అని నేను అనుకున్నాను.అందుకే గోవిందా గోవింద సినిమా చేయడమే కరెక్ట్ అని నేను భావించాను అని తెలిపాడు అశ్వినీదత్.

అందువల్లే ఆ కథ నాకు బాగా నచ్చింది అని రాంగోపాల్ వర్మ తెలిపాను అని చెప్పుకొచ్చాడు అశ్వినీదత్.అందువల్లే రంగీలా సినిమా హిందీకి వెళ్ళింది.అలాగే తన బ్యానర్లో చేసిన గొప్ప డైరెక్టర్ల లో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube