పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టకండి.. ఆయన స్థాయి వేరు.. బండ్ల గణేష్!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో గడుపుతున్న విషయం తెలిసిందే.

 Producer Bandla Ganesh Sensational Tweet About Pawan Kalyan,producer Bandla Gane-TeluguStop.com

వచ్చే ఎన్నికలలోపు తాను కమిట్ అయిన సినిమాల మొత్తం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అటు సినిమాలను ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు.కాగా భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు.

కానీ ఇంతవరకు ఆ నాలుగింటిలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు.నేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగం కంప్లీట్ చేసి మధ్యలోనే ఆపేశారు.

అలాగే హరీష్ శంకర్ భగవదీయుడు భగత్ సింగ్ మూవీ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు.

ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాలేదు.

అలాగే సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం, సురేంద్ర దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.కాగా వచ్చే ఎన్నికలలో ఈసారి ఎలా అయినా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని పవన్ కళ్యాణ్ గట్టిగానే కృషి చేస్తున్నాడు.

ఇందుకోసం జనసేన పార్టీ తరపున సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్.అయితే రాజకీయాల వైపు ఎక్కువగా దృష్టిని మళ్లించడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది.

అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు ఎప్పుడెప్పుడు పూర్తి అవుతాయా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరొకవైపు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం డైరెక్టర్స్ కూడా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే నిర్మాత పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బండ్ల గణేష్ అన్న పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు అన్న.

ఒక్కసారి కొంచెం క్లారిటీ ఇవ్వు అన్న.అసలు ఉందా లేదా అర్థం అవ్వడం లేదు అన్న.

అంటూ ట్విట్టర్‌లో బండ్ల గణేష్‌ ను ఒక అభిమాని ప్రశ్నించాడు.ఈ విషయంపై బండ గణేష్ స్పందిస్తూ.

మనది నిజమైన అభిమానం అయితే.మనం నిజంగా ఆయనను ప్రేమిస్తే.

ఆయన చేయబోతున్న కార్యక్రమానికి మంచి కలగాలని కోరుకుందాం.సినిమా వ్యాపారం.

ఆయనను దయచేసి ఇబ్బంది పెట్టకూడదు.ఇది మన బాధ్యత.

ఆయన స్థానం వేరు.ఆయన స్థాయి వేరు.

అంటూ కూల్ గా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు బండ్లన్న.కాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కేవలం తన సినిమాకేనా.

లేకపోతే ప్రస్తుతం పవన్ కమిట్ అయిన ఉన్న చిత్రాల గురించి కూడానా.అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube