నెల్లూరు జిల్లాలో పెన్నా బ్యారేజ్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.అనంతరం బ్యారేజ్ నిర్మాణ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈ బ్యారేజ్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.పెన్నా బ్యారేజ్, సంఘం బ్యారేజ్ పనులు 99 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.
అదేవిధంగా సంఘం బ్యారేజ్ పై దివంగత నేత గౌతమ్ రెడ్డి, నెల్లూరు బ్యారేజ్ పై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్యారేజ్ ల పనులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు.







