సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా రోజా అంటే తెలియని వారు ఎవరు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శ్రీలత రెడ్డి గా ఉన్న తన పేరున రోజాగా మార్చుకున్నారు.
ఎన్నో తెలుగు సినిమాలలో నటిగా నటించిన ఈమె ప్రస్తుతం రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు.ప్రస్తుతం రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్న రోజా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె నటిగా ఇండస్ట్రీలోకి ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అదేవిధంగా చెంబురతి అనే సినిమా ద్వారా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ సినిమాని డైరెక్టర్ సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రోజా సెల్వమణి మధ్య పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమ వరకు దారితీసిందని చెప్పాలి.
రోజా సినిమాలలోకి వచ్చేవరకు తన సోదరులు తనకోసం వారి కెరియర్ ను పణంగా పెట్టారని అయితే తాను సినిమాలలో నటించి వారినీ కెరియర్ లో సెటిల్ చేయాలని భావించారట.అయితే అప్పటికే సెల్వమణి ప్రేమలో ఉన్న ఈమె తన సోదరులు జీవితంలో సెటిల్ అవడం కోసం 11 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోకుండా తన ప్రేమను కొనసాగించారని తెలుస్తోంది.

ఇకపోతే రోజా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన జీవితంలో స్థిరపడిన అనంతరం 2022వ సంవత్సరంలో తాను ప్రేమించిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు సెల్వమనితో ఈమె వివాహం జరిగినట్లు వెల్లడించారు.ఇలా వివాహమైన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన రోజా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు.ఇకపోతే రీఎంట్రీ తర్వాత ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన పలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఈమె మంత్రి కావడంతో ప్రోటోకాల్ పాటిస్తూ తను బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమైందని చెప్పాలి
.






