జియో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ గురించి తెలుసా? ఒక్క రీచార్జ్‌తో 2 in 1 ప్లాన్స్ షురూ!

ఇండియాలో టెలికాం రంగంలో పెనుమార్పులు తెచ్చిన టెలికాం ఆపరేటర్ ఏదన్న వుంది అంటే, అది రిలయన్స్ జియో అని వేరే చెప్పనక్కర్లేదు.తాజాగా జియో తన వినియోగదారుల కోసం స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

 జియో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ -TeluguStop.com

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చామని చెబుతోంది.దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలోని ఒకదానితో 75GB అదనపు డేటా ప్రయోజనాలను కల్పిస్తోంది.అంతేకాకుండా విడిగా రూ.2,250 విలువైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది జియో సంస్థ.

అయితే ఈ ఆఫర్‌ ఎంతకాలం కొనసాగుతుందనే దాని గురించి మాత్రం సరైన సమాచారం అందుబాటులో లేదని గుర్తించుకోవాలి.కాబట్టి ఆలోచించినా ఆశాభంగం కాబట్టి.ఇప్పుడే త్వరపడండి.ఈ సంవత్సరం జియో యొక్క స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ రూ.2999 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తున్నది.ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2.5GB రోజువారీ డేటాను పొందవచ్చు.అలాగే వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలు పొందుతారు.

Telugu Benefits, August, Freedom Offers, Jioindependence, Jio Recharge, Prepaid,

అంతేకాకుండా రూ.2,250 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.వీటిలో Ajio(రూ.750 డిస్కౌంట్), నెట్‌మెడ్స్ (రూ.750 డిస్కౌంట్) మరియు Ixigo (రూ.750 డిస్కౌంట్) వంటివి ఉన్నాయి.జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లలో అందిస్తుంది.

మీరు తక్కువ మొత్తంలో ఖర్చు చేసి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచితంగా OTT యాక్సెస్‌ని పొందాలనుకుంటే కనుక ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube