ఇండియన్ క్రికెటర్ మిస్టర్ కూల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.అతని గురించి ప్రత్యేకించి పరిచయం అక్కట్లేదు.
ఇకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి.భారతజాతి జెండా గొప్పతనం తెలిసేలా “హర్ ఘర్ తిరంగా” పేరుతో సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా ప్రధాన నరేంద్రమోడీతో సహా అందరూ తమ సోషల్ మీడియా ఖాతాలను త్రివర్ణ పతకాలతో కూడిన డీపీలు పెడుతున్నారు.
అదేవిధంగా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఐనటువంటి వాట్సప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌ల్లోనూ ఫొటోలు షేర్ చేసుకుంటూ ప్రజలు మురిసిపోతున్నారు.
ఇక ఈ జాబితాలో టీమిండియా మాజీ కేప్టిన్ మహేంద్రసింగ్ ధోని చేరాడు.ఈ మధ్యన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మిస్టర్ కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మువ్వన్నెల జండాను తన డిసప్లే పిక్చర్‌గా మార్చేశాడు.
అక్కడితో ఆగకుండా “భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది” అని అర్థం వచ్చేలా హిందీ, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో ఓ కోట్‌ను అందులో జోడించాడు.సోషల్ మీడియాలో పెద్దగా చురుగ్గా ఉండని ధోని ఇపుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన డిపి మార్చడం విశేషమనే చెప్పుకోవాలి.ఇకపోతే భారత క్రికెట్‌కు ధోని సేవలను గుర్తించిన ప్రభుత్వం అతనికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించిన విషయం విదితమే.2018లో తన టెరిటోరియల్ ఆర్మీ యూనిఫాంతోనే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును స్వీకరించాడు.ఇక 2019లో పారాచూట్ రెజిమెంట్‌తో ఒక నెలకు పైగా శిక్షణ కూడా తీసుకున్నాడు.







