రాజకీయాలు ఎప్పుడు ఏ విధమైన మలుపు తిరుగుతాయో చెప్పలేం.ఎవరికి ఎప్పుడు లక్కీ ఛాన్స్ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది.
అకస్మాత్తుగా అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి.ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి నేతలకు మహర్దశ పట్టబోతోంది. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటనించే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి పట్టు పెంచుకుని మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
2019 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి చెందడం తో వైసిపి ఇప్పటికీ విమర్శలు చేస్తోంది 2024 లో ఎన్నికలను లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇంతకంటే ప్రతిష్టాత్మకంగా వైసిపి మంగళగిరిలో లోకేష్ ఓడించేందుకు పావులు కలుపుతోంది .ఈ మేరకు ఈ నియోజకవర్గంలో టిడిపి తరఫున యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టిడిపి కీలక నాయకులను వైసీపీలో చేర్చుకునే వ్యూహానికి తెరతీసింది.పేరు ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా, లోకేష్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చని ఎత్తుగడకు వచ్చింది.దీనిలో భాగంగా టిడిపి లో కీలకంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తోంది.
ఇప్పటికే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడంతో పాటు, నియోజకవర్గంలో ఉపాధి కల్పనపై దృష్టి సారించారు ఈ నియోజకవర్గంలోని గడపగడపను సందర్శించే విధంగా ఆయన టూర్లు చేస్తున్నారు .మొదటి నుంచి ఈ నియోజక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న వైసిపి నాయకులకు చెక్ పెట్టే విధంగా చేస్తున్నారు.అయితే దీనికి వీరుగుడుగా టిడిపిలోని కీలక నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి వైసీపీ తెరతీసింది.
ఇప్పటికే చాలామందిని పార్టీలో చేర్చుకుంది .మరి ఎంతోమందికి ఆర్థికంగానూ పదవులు పరంగాను భరోసా కల్పించింది .ముఖ్యంగా టిడిపిలో ఉంటూ అసంతృప్తికి గురైన గుర్తించి వారిలో బలమైన వారిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని పట్టుదలతో ఉంది.రెండోసారి లోకేష్ ఇక్కడ ఓటమి చెందితే ఆయన రాజకీయంగా కోలుకోలేరు అని వైసిపి ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు టిడిపిలోని చిన్న చితక నాయకులకు పదవులు, ప్రాధాన్యం, ఆర్థిక భరోసా ఇస్తాం అంటూ హామీ ఇస్తోంది.ఏదో విధంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా వైసిపి వ్యూహాలు రచిస్తోంది.







