మళ్లీ జగన్ దే హవా తేల్చేసిన ఇండియా టుడే సర్వే..!!

ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీలో మళ్లీ జగన్ దే హవా అని తేల్చి చెప్పింది.ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 స్థానాలు వస్తాయని పేర్కొంది.

 In India Today Survey Again Ys Jagan Win In Ap Ysrcp , Tdp, Ys Jagan-TeluguStop.com

ఇక టీడీపీకి ఏడు స్థానాలు వస్తాయని స్పష్టం చేయడం జరిగింది.అంతకుముందు ఇండియా టీవీ చేసిన సర్వేలో వైసీపీకి 19 స్థానాలు వస్తాయని పేర్కొంది.

దీంతో వరుసగా రెండుసార్లు ప్రముఖ సర్వేలలో వైసీపీకి అత్యధిక స్థానాల వస్తాయని ఫలితాలు రావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

కాగా ఇండియా టుడే సర్వేలలో పార్లమెంటు స్థానాల్లో ఉన్న నియోజకవర్గాలు బట్టి చూస్తే వైసీపీకి 126 స్థానాలలో తన పట్టు నిలుపుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలావరకు సంక్షేమ పథకాలతో సీఎం జగన్ సరికొత్త పాలన అందిస్తున్నారు.గత ప్రభుత్వాలలో పడిన కష్టాలు పడకుండా జగన్  ప్రభుత్వంలో పేదలు అత్యధికంగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నారు.

ఒక రోడ్లు విషయంలో మాత్రం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.అయినా కానీ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కారణంగా మళ్లీ వైఎస్ జగన్ రాబోయే ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వేలలో ఫలితాలు రావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube