కన్నడ భామ రష్మిక మందన్న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దూసుకెళ్తుంది.తెలుగులో స్టార్ హీరో సినిమా అంటే రష్మిక కాదన్న తర్వాతే వేరే వాళ్ల దగ్గరకు వెళ్తుంది.
అయితే ఆమెకు ఏర్పడ్డ ఈ డిమాండ్ మేరకు రష్మిక కూడా తన రూల్స్ ని మార్చేస్తుంది.ప్రస్తుతం సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక నిర్మాతలకు కొత్త కండీషన్ పెడుతుందట.సినిమా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే తన రెమ్యునరేషన్ లో 75 శాతం పేమెంట్ ఇచ్చేయాలని అంటుందట.
ఎందుకంటే సినిమా నిర్మాణం పెరిగే సరికి తర్వాత పేమెంట్స్ లేట్ అవుతున్న కారణం ఒకటి.సినిమా అనుకున్న విధంగా పూర్తి చేస్తారనే ఉద్దేశంతో రష్మిక ఈ కండీషన్స్ పెడుతుందట.
ఎలాగు ముందైనా వెనక అయినా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే కాబట్టి రష్మిక కండీషన్స్ కి నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారట.ప్రస్తుతం విజయ్ వారసుడు సినిమాలో నటిస్తున్న రష్మిక హిందీలో 3 ప్రాజెక్ట్ లు చేస్తుంది.
ఇక తెలుగులో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉందని తెలుస్తుంది. తను నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నిటికీ ముందే 70 శాతం రెమ్యునరేషన్ తీసుకుని చేయాలని ఫిక్స్ అయిందట రష్మిక.
అయితే ఈ కొత్త కండీషన్ నిర్మాతలకు కొద్దిగా ఇబ్బందే అని చెప్పొచ్చు.







