కేజిఎఫ్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన కన్నడ నటుడు యశ్ ఈ సినిమాతో రాఖీ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే ఈ సినిమాతో కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యశ్ తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఇంట్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే యశ్ సోదరి సాంప్రదాయ బద్ధంగా తనకు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రాఖీ బాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇదిలా ఉండగా మరోవైపు యశ్ పిల్లలు సైతం రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే యశ్ కుమార్తె తన సోదరుడికి రాఖీ కట్టి తనకు లడ్డు తినిపిస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇలా ఈ కుటుంబంలో జరిగిన రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదిక షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఒక సాధారణ కుటుంబం నుంచి సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.యశ్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఆయన తండ్రి మాత్రం ఇప్పటికీ ఆర్టీసీలో ఉద్యోగం చేయడం గమనార్హం.ఇకపోతే యశ్ తన సహనటి రాధిక పండిట్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.







