మాచర్ల అయిన ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందా.. కృతి శెట్టి ఆశలు నెరవేరేనా?

ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయినపోయిన బ్యూటీ కృతి శెట్టి.బేబమ్మ గా ఈమె చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

 Krithi Shetty Pins All Hopes On Nithiin Macharla Niyojakavargam, nithiin, Mache-TeluguStop.com

ఉప్పెన భారీ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు రెండు కూడా సక్సెస్ సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.

అయితే వరుస సక్సెస్ లలో ఉన్న ఈ బ్యూటీకి ది వారియర్ సినిమా ప్లాప్ అందించింది.వరుస హిట్స్ పడడంతో హ్యాట్రిక్ విజయం అందుకున్న బేబమ్మ మరో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లాలనుకున్న ఆమె ఆశలపై నీళ్లు ఆ ప్లాప్ చల్లింది.

కృతి శెట్టి రామ్ పోతినేని తో కలిసి ‘ది వారియర్’ సినిమాలో నటించింది.ఈ సినిమా జులై 14 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించుకున్న కలెక్షన్స్ పరంగా ప్లాప్ లిష్టులోకి వెళ్ళిపోయింది.

ఇక ఈ ప్లాప్ తర్వాత ఈ అమ్మడు ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం ”మాచర్ల నియోజక వర్గం’‘.

ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న అంటే ఈ రోజున రిలీజ్ కాబోతుంది.

Telugu Krithi Shetty, Krithishetty, Nithiin-Movie

ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనేలా ప్రొమోషన్స్ ప్లాన్ చేసారు.ది వారియర్ సినిమా తర్వాత కృతి నటించిన సినిమా కావడంతో ఈమె ఈ సినిమాతో అయినా ఆ ప్లాప్ ను చెరిపేసుకోవాలని చూస్తుంది.మరి ఈ సినిమా అయినా ఈమెకు హిట్ ఇచ్చి ఈమె ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.ఈ సినిమా హిట్ అయితే కనుక మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube