సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.ప్రభుత్వ నిర్వాకంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా మహిళ సంఘాలకు రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలన్నారు.
మెప్మా, సెర్ఫ్, ఎస్.హెచ్.జీలకు వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్లు మిగిలిపోయాయని విమర్శించారు.టీఆర్ఎస్ పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు.బడ్జెట్ లో మహిళ గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3 వేల కోట్టు కేటాయించినా అమలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు.







