ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన !ఎస్పి సిద్ధార్థ కౌశల్.కర్నూలు జిల్లా ఆలూరు లోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న హాలహర్వి చెక్ పోస్ట్ ను పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తనిఖీ చేశారు.
ముందుగా హాలహర్వి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అనంతరం రికార్డులను పరిశీలించారు, అనంతరం ఎస్పి మాట్లాడుతూ అక్రమంగా మద్యం పట్టుబడిన వాహనాలపై కేసులను త్వరగా మూసివేయాలని లోక్ అదాలత్ కేసులను కౌన్సిలింగ్ చేసి త్వరగా ముగించాలని ఆదేశించారు అనంతరం హాలహర్వి సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న చెక్ పోస్ట్ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ కర్ణాటక నుండి వచ్చే ప్రతి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కర్ణాటక నుండి అక్రమ మద్యాన్ని అరికట్టాలని చెక్ పోస్ట్ సిబ్బందిని ఆదేశించారు… ఈ కార్యక్రమానికి స్పెషల్ బ్రాంచ్ సి ఐ ప్రసాద్ ఆలూరు సిఐ ఈశ్వరయ్య ఎస్ ఐ విజయ్ కుమార్ చెక్ పోస్ట్ సిఐ శేషాచలం తదితరులు పాల్గొన్నారు.