సినీ నటి జీవితా రాజశేఖర్ చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరైయ్యారు.జోస్టర్ గ్రూప్ యాజమాన్యం తమ వద్ద రూ.26 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని పేర్కొంది.
ఈ వ్యవహారంపై జోస్టర్ గ్రూప్ యాజమాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జీవితకు నోటీసులు జారీ చేసింది.
అయితే, జోస్టర్ గ్రూప్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే జీవితా విమర్శించారు.న్యాయస్థానం అంటే గౌరవం ఉందని, అందుకే కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు అవుతామని తెలిపారు.
ఈ క్రమంలోనే కోర్టు విచారణకు జీవితా రాజశేఖర్ స్వయంగా హాజరు అయ్యారు.







