తెలంగాణలో రాజకీయం అంతా మునుగోడు చుట్టూనే తిరుగుతోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
ఈ నేపథ్యంలో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అధికార టీఆర్ఎస్ తో పాటు, విపక్ష పార్టీలు దృష్టి సారించాయి.దీనిలో భాగంగా మునుగోడుపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతుంది.
గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.ఇప్పటికే పార్టీలోని ముఖ్య నేతలతో కాంగ్రెస్ స్టేట్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే చండూర్ నియోజకవర్గంలో సభ నిర్వహించిన కాంగ్రెస్.ఆజాదీ కా అమృత్ గౌరవ్ లో భాగంగా ఈనెల 13 వ తేదీ నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టనుంది.
సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను నిర్వహించనుండగా.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు.ఈ నెల 16 వ తేదీ నుంచి మూడు రోజులపాటు మండలస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.అదేవిధంగా 20 నుంచి అన్ని గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.







