వైరల్ వీడియో : త్రివర్ణ జలపాతం ఎప్పుడైనా చూశారా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 Viral Video: Have You Ever Seen Tricolor Falls , Viral Latest, News Viral, Socia-TeluguStop.com

ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో తమ డీపీ జాతీయ జెండాగా మార్చుకున్నారు.ఎక్కుడ చూసిన త్రివర్ణ పతాకం కనిపించేలా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.

ఈక్రమంలో ఓ జలపాతం వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.అదే త్రివర్ణ జలపాతం.

ప్రస్తుతం ఈ జలపాతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది.

ఈ వీడియోలో కొండపై నుంచి జలపాతం వచ్చి పడుతోంది.ఆ నీరు తెల్లగా కాకుండా అచ్చం జాతీయ జెండా రంగులో ఉన్నాయి.ఆ నీటికి ఒకవైపు కషాయం రంగు, మధ్యలో తెలుపు, మరోవైపు ఆకుపచ్చ రంగులో ప్రవహిస్తున్నాయి మూడు రంగులతో నీరు పడుతుంటే ఆ దృశ్యం అద్భుతమనే చెప్పాలి.ఈ అద్భుతాన్ని మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తోంది.

దీనిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.మువ్వెన్నల జెండా కురుస్తున్నట్లుగా ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో అన్ని సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో ఎక్కడన్నది తెలియరాలేదు.

జాలపాతానికి వద్దకు వచ్చిన ప్రజలు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.కెమెరాల్లో, స్మార్ట్ ఫోన్లలో దీనిని బంధించారు.నిజానికి స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే చాలా చోట్ల సంబరాలు మొదలయ్యాయి.ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రచారం చేస్తున్నారు.దీంతో ఊరూరా జాతీయ జెండాలను పంచుతూ ఓ ఉద్యమం నిర్వహిస్తున్నారు.ఇక సోషల్ మీడియాల్లో అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube