ఎవరూ లేని సమయంలో అమ్మవారి ఆలయంలో వింతలు

శాస్త్ర సాంకేతిక ఎంత అభివృద్ధి చెందిన ప్రజల విశ్వాసాలు చెక్కు చెదర లేదు.ఒక్కోసారి భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు రెట్టింపు అవుతుంటాయి.

 Strange Things In Ammavari's Temple When No One Is Around, Amma, Goodness, Sound-TeluguStop.com

కొంత మంది ఎంత కొట్టి పారేసినా, ఆలయాలలో జరిగే వింతలను కనిపెట్టలేకపోతుంటారు.తాజాగా అలాంటి ఓ ఘటన ఏపీలోని పార్వతీపురం జిల్లాలో జరుగుతోంది.

అమ్మవారి ఆలయంలో ఎవరూ లేని సమయంలో వచ్చే శబ్దాలు చూసి తొలుత అంతా భయపడ్డారు.అయితే అవి అమ్మవారి మహిమలుగా భావించి, భక్తిశ్రద్దలతో కొలుస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

టెక్నాలజీకి మించిన అతీత శక్తి ఏదో ప్రపంచాన్ని నడిపిస్తోందని ఎక్కువ మంది నమ్ముతుంటారు.

తాజాగా అలా నమ్మేవారి ఊహకు మించిన విధంగా అమ్మవారి ఆలయంలో కొన్ని సంఘటనలు జరిగాయి.పార్వతీపురం పట్టణంలోని నాయుడుపేట ప్రాంతంలో పోలమ్మ గుడి ఉంది.నిత్యం భక్తులు అక్కడికి వచ్చి, పూజలు చేస్తుంటారు.ఇటీవల సమీప ప్రాంతాల వారికి వింత శబ్దాలు వినిపించాయి.

గాజుల చప్పుళ్లు, వింత శబ్దాలు రావడం, పసుపు వాసన కూడా వస్తుండడంతో స్థానికులు తొలుత భయపడ్డారు.పరిశీలించి చూస్తే ఎవరూ కనిపించ లేదు.

దీంతో అవి మానవుల వల్ల జరిగినవి కావని తెలుసుకున్నారు.అమ్మవారి మహిమలుగా భావించి, పూజలు మరింత నిష్టగా చేయసాగారు.

ఈ విషయం చిలువలు పలువలుగా ఊరంతా పాకిపోయింది.దీంతో ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న భక్తులు తండోప తండాలుగా పోలమ్మ గుడికి వచ్చేస్తున్నారు.

అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి, పూజలు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా జనసందోహంతో నిండిపోతోంది.

జాతర సమయంలో కనిపించేలా జనాలు భారీగా తరలి వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube