బుల్లితెర నటి శ్రీవాణి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్న హరిత..వీడియో వైరల్!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత బుల్లితెర నటీమణులు ఒకవైపు పలు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.ఈ విధంగా వారి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటున్నారు ఏంటి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోల ద్వారా అభిమానులతో పంచుకొని అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు.

 Haritha Shed Tears After Seeing The Situation Of Sreevani Details, Varalakshmi V-TeluguStop.com

ఇకపోతే తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుల్లితెర సీనియర్ నటి హరిత ఇంట్లో వరలక్ష్మీ వ్రత వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతోమంది బుల్లితెర నటీమణులు హాజరయ్యి సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియోని హరిత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నారు.ఇకపోతే వరలక్ష్మి వ్రతానికి మరొక బుల్లితెర నటి శ్రీవాణి ఆమె కూతురు నందిని కూడా హాజరయ్యారు.

అయితే శ్రీవాణిని చూసిన హరిత ఒక్కసారిగా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.శ్రీవాణి ఏడవద్దని సైగలు చేస్తున్నప్పటికీ ఆమె మాత్రం ఎంతో ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.

నటి శ్రీ వాణి గత కొంత కాలం నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఒక నెల రోజులపాటు ఆమె మాట్లాడకుండా ఉంటేనే తనకు యధావిధిగా మాట వస్తుందని లేకపోతే పూర్తిగా తను మాట కోల్పోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లు శ్రీవాణి భర్త విక్రమ్ ఒక వీడియో ద్వారా తెలియజేశారు.అప్పటి నుంచి శ్రీ వాణి మాట మాట్లాడకుండా కేవలం సైగలకు మాత్రమే పరిమితమయ్యారు.ఈ క్రమంలోనే తన పరిస్థితిని చూసిన హరిత ఒక్కసారిగా ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube